- నెట్ ద్వారా మన వివరాలన్నీ బహిర్గతం
- హెచ్‌టీఎంఎల్5లోని ఓ సాఫ్ట్‌వేర్‌తో ప్రమాదం
వాషింగ్టన్: ఫోన్ ఏదైనా.. ఎన్ని సాఫ్ట్‌వేర్‌లున్నా.. స్మార్ట్‌ఫోనైనా.. మామూలు ఫోనైనా.. పనిచేయాలంటే బ్యాటరీ ఉండాలి. దాని నుంచి శక్తి రావాలి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీలు శక్తినివ్వడమే కాదు గూఢచర్యమూ చేస్తాయి! మన చేతిలోనే మనకు తెలియకుండా ని‘గూఢ’ శత్రువులా ఉండి ఉండొచ్చు. నెట్ వాడేటపుడు.. ఫోన్లు చేసేటపుడు ప్రైవసీ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ గూఢచారి బ్యాటరీ ముందు ఆ పప్పులేవీ ఉడకవని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని ప్రైవసీలు పెట్టుకున్నా స్మార్ట్‌ఫోన్ వాడే వ్యక్తి వివరాలన్నీ ఆ బ్యాటరీ ద్వారా తెలిసిపోతాయట. హెచ్‌టీఎంఎల్5 లోని ఓ సాఫ్ట్‌వేర్‌తో ఇలా బ్యాటరీ ద్వారా వివరాలు తెలిసిపోతాయి. వెబ్‌లోని కొన్ని సైట్లను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆ సాఫ్ట్‌వేర్.. వినియోగదారుడి ఫోన్లో ఉన్న బ్యాటరీ నిడివి గురించి పలు వెబ్‌సైట్లకు సమాచారం ఇస్తుంది. తద్వారా లో బ్యాటరీ ఉన్నప్పుడు దానిని పరిరక్షించేందుకు ఆయా వెబ్‌సైట్లు ఉపకరిస్తాయి. అయితే ఉపకారం మాటెలా ఉన్నా.. ఆ సమాచారంతోనే వినియోగదారులు నెట్ వాడుతున్నప్పుడు ఫోన్ వివరాలు, వినియోగదారుడి వివరాలను గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్ చేసేస్తారు. ఇంటర్నెట్ వాడే ఓ వినియోగదారుడి వివరాలను తెలుసుకునేందుకు సాధారణంగా వీపీఎన్, ప్రైవేట్ బ్రౌజింగ్‌లు చాలు. అయితే ఇప్పు డు దానికి అదనంగా బ్యాటరీ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు తోడయ్యాయి. ‘ద లీకింగ్ బ్యాటరీ: ఎ ప్రైవసీ అనాలసిస్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్5 బ్యాటరీ స్టేటస్ ఏపీఐ’ అనే అధ్యయనం ద్వారా పరిశోధకులు ఈ విషయాలు వెల్లడించారు. బ్యాటరీ సమాచారాన్ని వెబ్‌సైట్లు తెలుసుకునేముందు వినియోగదారులకు ఆ సమాచారం కనీసం తెలియదని చెప్పారు. కాబట్టి బ్యాటరీ సాఫ్ట్‌వేర్ స్టేటస్ ఎలా ఉపయోగపడుతుందన్న సమాచారాన్ని వినియోగదారులకు ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
Source: ABN Andhrajyothi
|
No comments:
Post a Comment